విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు, అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 500 మంది పేదలకు 3 కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు, ఐదు కోడిగుడ్లు అందజేశారు.
అనంతరం రెల్లి వీధిలో ఉంటున్న రెండు పేద కుటుంబాలకు 3000, 2500 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకురాలు కేదార్ లక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి