SCHOLARSHIP YUVA STORY: ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నా ఈ యువకుడు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు రావడంతో ఐఐటీలో సీటొచ్చింది. చాలా మంది పీజీ తరవాత పీహెచ్‌డీ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ యువకుడు మాత్రం ఇంజినీరింగ్ నుంచి నేరుగా పరిశోధన వైపు వెళ్లాడు.
అలా ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం రైస్ యూనివర్శిటీలో పరిశోధన చేసే అవకాశం లభించింది. నానో ఫొటోనిక్స్‌పై పరిశోధన చేసేందుకు రైస్ వర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ విభాగానికి దరఖాస్తు చేశాడు. దీంతో ఇతడి పరిశోధనకు సంబంధించిన ఇంటర్యూ నిర్వహించిన విశ్వవిద్యాలయం భరద్వాజ్‌ను ఎంపిక చేసింది. ఎంతో మంది పోటీ పడే ఈ యూనివర్సిటీలో నాకు సీటు రావడం అదృష్టంగా భావిస్తునని అంటున్నాడు భరద్వాజ్.
" నాకు రైస్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ వచ్చింది. దీనికోసం పూర్తి స్కాలర్షిప్ను వర్సిటీ అందిస్తుంది. నేను బీటెక్‌లో చేసిన రీసెర్చ్‌ను మెచ్చుకుని నా ఫీజు మొత్తం కట్టి, నాకు ప్రతినెల స్టైఫండ్ ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. రైస్ యునివర్సిటీ అనేది చాలా తక్కువ మందిని ఎంపిక చేసుకుంటుంది. 'నానోఫొటానిక్' అనేది నా పరిశోధన అంశం."- భరద్వాజ్, రైస్ యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థి
రైస్ యూనివర్సిటీకి ఎంపికైనందుకు రుసుం చెల్లించనవసరం లేదు. అయిదేళ్ల పాటు పరిశోధన సాగించాల్సి ఉండగా ఈ మొత్తం కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా భరద్వాజ్‌ను యూనివర్సిటీ పరీక్షించింది. పరిశోధన అంశాలకు సంబంధించి మరికొన్ని అంశాలను అడిగినట్టు భరద్వాజ చెబుతున్నాడు.
భరద్వాజ్‌కు రైస్ వర్సిటీలో సీటు రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో అన్నింట్లోనూ ముందుడేవాడు. తన కష్టంకు తగ్గ ప్రతిఫలం లభించిందని భరద్వాజ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
" మా అబ్బాయికి పీహెచ్‌డీ చేయడానికి అవకాశం వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బాగా ఆసక్తిగా చదువుతాడు. అందుకే మేము ప్రోత్సహిస్తున్నాం. జాబ్‌కు వెళ్లమని చెప్పడంలేదు. డైరెక్టుగా బీటెక్ నుంచే పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది."- భరద్వాజ్, తల్లిదండ్రులు
తనలాంటి విద్యార్థలను ఎంతో మందిని తయారు చేసి సమాజంలోని సమస్యలను అధిగమించడమే లక్ష్యమని అంటున్నాడు. దీని కోసం తిరిగి భారత్‌కు వచ్చి ఐఐటీ వంటి సంస్థలో చేరి యువతకు పరిశోధనలపై సన్నద్ధం చేయడమే నా లక్ష్యం అంటున్నాడు భరద్వాజ్.
ఇవీ చదవండి: