ETV Bharat / city

సాహసమే నందిత వ్యాపకం

పర్వతారోహణ సాహసంతో కూడుకున్న వ్యాపకం. పర్వతారోహకుల్లో పురుషులే అధికంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు మహిళలు సైతం సై అంటూ పర్వతాలు ఎక్కేస్తున్నారు. ఈ సాహస వ్యాపకాన్ని ఆరోగ్య సూత్రంగా మార్చుకున్నారు విశాఖకు చెందిన జి.నందిత. వివిధ దేశాల్లోని పర్వతాలు అధిరోహించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

nandita mountaineer
nandita mountaineer
author img

By

Published : Dec 7, 2020, 8:55 PM IST

పర్వతారోహణలో నందిత
పర్వతారోహణలో నందిత

విశాఖలోని ఐ.ఐ.ఎం.లో సహాయ మేనేజర్‌ హోదాలో ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగం పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే ప్రతియేటా వివిధ ప్రాంతాలకు యాత్రలు చేయడం, పర్వతారోహణ(ట్రెక్కింగ్‌)కు వెళ్తూ ఆరోగ్య సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జి.నందిత. పర్వతారోహణ చేయడం వంటి ఒకింత సాహసంతో కూడుకున్న వ్యాపకాలను ఎంచుకోవడంలో మహిళలు ఆసక్తి చూపడం లేదని.. అలాంటి రంగాలపై దృష్టి సారిస్తే మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నందిత అంటున్నారు. తన విజయప్రస్థానాన్ని ఆమె ఈనాడు, ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే

"నేను బీచ్‌రోడ్డులో ఉంటాను. మా నాన్న నాగేశ్వరరావు సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. తల్లి అరుణ గృహిణి. మాకు ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాలకు వెళ్లడం అలవాటు. నాకు ఇంటర్​లో 93 శాతం మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్‌కు వెళ్లకుండా సీఏ(ఛార్టెడ్‌ అకౌంటెంట్‌) చేస్తే మంచి అవకాశాలున్నాయని భావించాను. అందుకు అనుగుణంగా సీఏ పరీక్షలు రాయడానికి వీలుగా కఠోర సాధన చేశాను. సీఏతోపాటు సి.డబ్ల్యు.ఎ.,(కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్‌), సి.ఎస్‌.(కంపెనీ సెక్రటరీ) కోర్సులు మూడింటినీ విజయవంతంగా పూర్తిచేశాను. ప్రస్తుత విశాఖ ఐ.ఐ.ఎం.లో ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగం పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను."

  • పర్వతారోహణలో ఎందుకు వెనకబడాలి

"పర్వతారోహణ చేసేవారిలో అత్యధికశాతం మంది పురుషులే ఉంటున్నారు. మహిళల సంఖ్య తక్కువగా ఉంటుందనే చెప్పాలి. దీంతో పర్వతారోహణకు వెళ్లడాన్ని నా వ్యాపకంగా మార్చుకున్నాను. పర్వతారోహణకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మహిళలు దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. శారీరక దారుఢ్యం కోసం నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు రెండుగంటలు వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకున్నాను. నేను ఎంచుకున్న వ్యాపకం కారణంగా మరింత ఆరోగ్యవంతమైన జీవనం సాగించగలుగుతున్నాను."

  • కంబాలకొండతో మొదలుపెట్టాను

"నేను దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగాను. దిల్లీ, పాండిచ్చేరి, కులు మనాలి, రోహ్‌తంగాపాస్, ధర్మశాల, హరిద్వార్, డార్జిలింగ్, లోనావాలా తదితర ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్నది నా ఉద్దేశం. ఆ యాత్రల్లో భాగంగా నేను సాహసయాత్రలకు వెళ్లే చాలా మందిని చూసి స్ఫూర్తి పొందాను. ముందుగా విశాఖ నగరంలోని కంబాలకొండతో పర్వతారోహణను మొదలుపెట్టాను. కంబాలకొండపై నడవడం పెద్దకష్టమేమీ కానప్పటికీ పర్వతారోహణపై అవగాహన పెంపొందుతుందన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్లాను."

  • నేపాల్‌లోని సండక్‌పు పర్వతారోహణ

"డార్జిలింగ్‌ నుంచి సండక్‌పు పర్వతానికి ‘యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (వై.హెచ్‌.ఎ.ఐ.) ఆధ్వర్వంలో పర్వతారోహణకు వెళ్లాను. 12500 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే 51 కి.మీ.ల నడవాలి. అందుకు అనుగుణంగా పర్వతారోహణ నిర్వహించే వారు సూచించిన జాగ్రత్తలన్నింటినీ రెండు నెలల ముందు నుంచే పాటించాను. ప్రతిరోజూ సుమారు 35 నిమిషాల వ్యవధిలో ఐదు కి.మీ.ల దూరం వరకు నడవగలుగుతున్నానా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించుకునేదాన్ని. ఫలితంగా నాకు బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నాతోపాటు నా స్నేహితురాళ్లు ప్రియాంక, విశాఖ, నవ్య, కోమల్‌ వచ్చారు. నిర్వాహక సంస్థ మరికొందరితో ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులపాటు జరిగిన పర్వతారోహణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశాను."

పర్వతారోహణలో నందిత, ఆమె మిత్రులు
సండక్‌పు పర్వతారోహణలో పాల్గొన్న నందిత, ఆమె మిత్రులు
  • భర్తతో కలిసి చంద్రశీల పర్వతారోహణ

"2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త కల్యాణ్‌ కూడా నాతోపాటు పర్వతారోహణకు వచ్చారు. 2019వ సంవత్సరం డిసెంబరులో ఉత్తరాఖండ్‌లోని ‘చంద్రశీల’ పర్వతానికి వెళ్లాం. ఆ పర్వతారోహణ పూర్తిచేయడానికి కూడా సుమారు 27 కి.మీ.ల దూరం నడిచాం. ఇండియా హైక్స్‌ అనే సంస్థ పర్వతారోహణ ఏర్పాట్లు చేసింది. తీవ్రమైన మంచు పరిస్థితులను కూడా తట్టుకోగలిగాను. 12,083 అడుగుల ఎత్తులో ఉన్న ఆ పర్వత శిఖరానికి చేరి తిరిగి రావడానికి మొత్తం ఆరు రోజుల సమయం పట్టింది. మంచు గుట్టల మధ్య నడుచుకుంటూ చలిగాలుల తీవ్రతను కూడా లెక్క చేయకుండా కొంత దూరం ప్రయాణించడం మరపురాని అనుభూతి. చంద్రశీల పర్వాతారోహణలో నా సోదరి భార్గవి, స్నేహితులు సుమారు 15 మంది కూడా పాల్గొన్నారు."--- జి.నందిత, పర్వతారోహకురాలు

ఇదీ చదవండి : రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.