మత్స్య ఎగుమతుల్లో దేశం తొలి స్థానానికి చేరాలి: ఉపరాష్ట్రపతి - vice president visits cmfri latest news
కరోనా సమయంలో భారత మత్స్యరంగ ప్రాధాన్యత మరోసారి రుజువైందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మత్స్య ఎగుమతుల్లో మన దేశం మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. మత్స్య సంపద పోషక ప్రయోజనాలపై అవగాహన పెరగాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సి.ఐ.ఎఫ్.టి) సంస్థలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ప్రదర్శనశాలలను తిలకించిన ఆయన... మత్స్యరంగంలో వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈ సంస్థలు అభివృద్ది చేసిన స్నాపర్ సీడ్స్ ను దేశానికి అంకితం చేశారు.
-
ఈరోజు విశాఖపట్నంలోని సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. మరియు సి.ఐ.ఎఫ్.టి. కేంద్రాలను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు మరియు సిబ్బందితో మాట్లాడటం ఆనందదాయకం. స్నాపర్ సీడ్స్ ఉత్పత్తి ద్వారా మారీకల్చర్ అభివృద్ధిలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. @icarindia #CMFRI #CIFT pic.twitter.com/8NRTWp2oZb
— Vice President of India (@VPSecretariat) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈరోజు విశాఖపట్నంలోని సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. మరియు సి.ఐ.ఎఫ్.టి. కేంద్రాలను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు మరియు సిబ్బందితో మాట్లాడటం ఆనందదాయకం. స్నాపర్ సీడ్స్ ఉత్పత్తి ద్వారా మారీకల్చర్ అభివృద్ధిలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. @icarindia #CMFRI #CIFT pic.twitter.com/8NRTWp2oZb
— Vice President of India (@VPSecretariat) December 7, 2020ఈరోజు విశాఖపట్నంలోని సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. మరియు సి.ఐ.ఎఫ్.టి. కేంద్రాలను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు మరియు సిబ్బందితో మాట్లాడటం ఆనందదాయకం. స్నాపర్ సీడ్స్ ఉత్పత్తి ద్వారా మారీకల్చర్ అభివృద్ధిలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. @icarindia #CMFRI #CIFT pic.twitter.com/8NRTWp2oZb
— Vice President of India (@VPSecretariat) December 7, 2020
అవగాహన కల్పించాలి....
శాస్త్రవేత్తలు, సిబ్బందితో ఉపరాష్ట్రపతి పలు అంశాలను పంచుకున్నారు. చేపల్లో ప్రొటిన్లు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో భారతదేశ వార్షిక ఉత్పత్తి - డిమాండ్ - సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా కృషి జరగాలని ఆయన కోరారు. న్యూట్రాస్యూటికల్స్’, ‘ఆర్నమెంటల్ ఫిష్’ వంటి వినూత్న ఉత్పత్తుల ద్వారా భారతీయ సముద్ర జీవ సంస్కృతి వైవిధ్యం పెరగాలన్నారు. చేపల్లో ఒమేగా త్రీ ప్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, గుండె ఆరోగ్యానికి చేకూర్చే మేలుపై సామాన్యులకూ అవగాహన కల్పించాలని వైద్యులు, ఆహార నిపుణులను కోరారు.
-
కరోనా మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఆహారం విషయంలో క్రమశిక్షణ ఒకటి. కరోనా తదనంతరం కూడా ఇదే తరహా పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. #CMFRI #CIFT pic.twitter.com/vDlqVZH0Pq
— Vice President of India (@VPSecretariat) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనా మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఆహారం విషయంలో క్రమశిక్షణ ఒకటి. కరోనా తదనంతరం కూడా ఇదే తరహా పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. #CMFRI #CIFT pic.twitter.com/vDlqVZH0Pq
— Vice President of India (@VPSecretariat) December 7, 2020కరోనా మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఆహారం విషయంలో క్రమశిక్షణ ఒకటి. కరోనా తదనంతరం కూడా ఇదే తరహా పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. #CMFRI #CIFT pic.twitter.com/vDlqVZH0Pq
— Vice President of India (@VPSecretariat) December 7, 2020
మత్స్య ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. లోతట్టు, సముద్ర మత్స్య సంపదను ఉపయోగించుకోవడం వల్ల ఎగుమతుల్లో ప్రపంచంలోనే తొలి స్థానానికి ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు.
ఇదీ చదవండి