ETV Bharat / city

VENKAIAHNAIDU: దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర: ఉపరాష్ట్రపతి - Vice President venkaiah naidu visakha port

దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని.. ప్రాచీన భారత్‌ వైభవాన్ని మళ్లీ తేవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) సూచించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతితో విశాఖ పోర్టు(visakha port) ఛైర్మన్ రామ్మోహన్‌రావు, ఇతర అధికారులు భేటీ అయ్యారు.

Vice President venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Jun 26, 2021, 7:11 PM IST

Updated : Jun 26, 2021, 7:49 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని.. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(vice president venkaiah naidu) అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న వెంకయ్య.. విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. ఆయన్ను కలిసిన పోర్ట్ ఛైర్మన్​ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు.. పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాలను తెలియజేశారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్‌హౌజింగ్ జోన్(ఎఫ్‌టీడబ్ల్యూజెడ్) ఏర్పాటు విషయాన్ని ఉపరాష్ట్రపతికి ట్రస్టు ఛైర్మన్​ వివరించారు.ఈ సందర్భంగా ఇతర అంశాల్లోనూ ట్రస్టు సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి అభినందించారు.

పోర్టుల ఆధారిత అభివృద్ధి..

భారతదేశంలో నౌకాయాన మౌలిక వసతుల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల’ కార్యక్రమాన్ని(sagaramala) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంతో 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దీంతోపాటుగా రూ.3.57లక్షల కోట్ల మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు.

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి..

2015-16 నుంచి 2019-20 వరకు కార్గో రవాణా విషయంలో విశాఖపట్టణం సాధించిన ప్రగతిని వెంకయ్య ప్రస్తావించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఇబ్బందులు తలెత్తాయని.. త్వరలోనే అన్నీ సర్దుకుని మళ్లీ విశాఖ పోర్టు ప్రగతిపథాన పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహా పోర్టు(vizag port) అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 4,147 కరోనా కేసులు, 38 మరణాలు

Last Updated : Jun 26, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.