రక్షణ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకా దళం తరఫున 'కోస్టల్ నావెల్ బ్యాటరీ' ఆఫీసర్ ఇంఛార్జి కెప్టెన్ విజయ్ సింగ్.. బీచ్ రోడ్‌లోని స్మారకం స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ.. స్థూపం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచారు. ధైర్య సాహసాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. వారి గౌరవార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
నిస్వార్థ సైనికుల త్యాగాలకు దేశం మొత్తం కృతజ్ఞతలు చూపుతోందని కెప్టెన్ విజయ్ సింగ్ తెలిపారు. ప్రతి ఏటా రక్షణ దళాలు జనవరి 14న మాజీ సైనికుల దినోత్సవాన్ని పాటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రక్షణ దళాల్లో పని చేస్తున్నవారికి, పదవీ విరమణ చేసిన సైనికులకు మధ్య మరింత బంధం ఏర్పడేందుకు.. ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. విశ్రాంత కమాండర్ ఎంఎస్ఎంకె శర్మ, డాక్టర్ చంద్ర శేఖర్‌తో పాటు పలువురు నౌకా దళ విశ్రాంత అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: