Unbearable cold in Visakha Agency: విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గాలులు తగ్గడంలేదు. పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. రథసప్తమి దాటి పోయినప్పటికీ మన్యంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టలేదు. ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుని అక్కడి ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పొగమంచు దట్టంగా వ్యాపించడంతో వాహనచోదకులు రహదారి కనిపించక ఇబ్బంది పడుతున్నారు. లైట్ల వెలుతురులో వాహనాలు నడుపుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ సూర్యోదయం కనిపించనంతగా పొగమంచు కప్పేస్తుంది. రాత్రి వేళలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. మినుములూరులో 11, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల చివరి వరకు వాతావరణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగ సిబ్బంది తెలుపుతున్నారు.
ఇదీ చదవండి : TTD TICKETS: నేటి నుంచి ఉదయాస్తమాన సేవాటికెట్ల మంజూరు