జీవీఎంసీ చేపట్టే అభివృద్ధి పనులపై ప్రత్యేక థర్డ్ పార్టీ ఏజెన్సీ నిఘా ఉండనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెండర్ల దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రజా పనులు, నిర్మాణ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, నీటి సరఫరా, ఉద్యాన పనులు, అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా చేసే కొన్ని ప్రాజెక్టుల్లో కూడా ప్రత్యేక నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ బృందంలో 48 మంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టతనిచ్చారు. వీరు జోన్ల వారీగా ప్రతి వారం, ప్రతి నెలా, ప్రతి 3 నెలలకోసారి కమిషనర్‌కు నివేదికలు పంపనున్నారు. తదనుగుణంగా అవినీతి జరిగినచోట చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: ఏలూరుకు కేంద్ర వైద్య బృందం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి