విశాఖలో వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో మద్దిలపాలెం జట్టుకు, లయన్స్ జట్లకు మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ పోరులో 2 వికెట్ల తేడాతో మద్దిలపాలెం జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన జట్టుకు 10 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు.
ప్రగతిభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎం.వి.వి. సత్యనారాయణ, సత్యవతి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: