ETV Bharat / city

'విశాఖ ఉక్కు పని తీరు సంతృప్తికరం' - visakha updates

విశాఖ స్టీల్ ప్లాంట్ పనితీరుపై పార్లమెంటరీ స్తాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్కు రంగం మందగమనంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ తీసుకుంటున్న చర్యలను ఉక్కు శాఖ చెప్పిన వివరాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 2019-20తో పోలిస్తే 2020-21లో ఈ సంస్థ 34% వృద్ధి సాధించడాన్ని నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది.

Visakha Steel Plant
విశాఖ స్టీల్ ప్లాంట్
author img

By

Published : Aug 8, 2021, 7:27 AM IST

విశాఖ ఉక్కు పని తీరుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. 2019-20తో పోలిస్తే 2020-21లో ఈ సంస్థ 34% వృద్ధి సాధించడాన్ని నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఆ సంస్థ యాజమాన్యం విస్తృత చర్యలు తీసుకొని, రాబోయే రోజుల్లో మరింత వృద్ధి రేటు సాధించాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం ఉత్పత్తి పరంగా మంచి పనితీరు కనబరుస్తున్న ఈ సంస్థ ఆర్థిక పరిస్థితులను పునరుద్ధరించుకోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించింది. గత 4-5 ఏళ్లుగా ఈ సంస్థ నష్టాల్లో కొనసాగుతున్న విషయాన్ని కమిటీ గుర్తించింది. దాదాపు రూ.22 వేల కోట్ల రుణం కారణంగా దానిపై వడ్డీ భారం పెరిగిపోవడం వల్ల సంస్థ తీవ్రమైన సమస్యలను చవిచూస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ఖర్చులను తగ్గించుకొనే చర్యలపై దృష్టి సారించి లాభాల బాటలోకి తేవడానికి అనువైన విశిష్ట ఉత్పత్తులపై దృష్టి సారించాలని సూచించింది. ఉక్కు రంగం మందగమనంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ తీసుకుంటున్న చర్యలను ఉక్కు శాఖ చెప్పిన వివరాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పనితీరు మెరుగుపరుచుకోవడానికి విశాఖ ఉక్కు చర్యలు చేపట్టిందని స్థాయీ సంఘానికి కేంద్ర ఉక్కుశాఖ వివరించింది.

చేపట్టిన చర్యలివీ..

  • ఉత్పత్తిని పెంచడం: ఉక్కు రంగానికి 2020 నవంబరు నుంచి మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో ఈ సంస్థలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని డిసెంబరు నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి పెంచారు. 2021-22లో 6.4 మిలియన్‌ టన్నుల ద్రవ ఉక్కు ఉత్పత్తి చేశారు. ఈ సంస్థ సామర్థ్యాన్ని (6.3 మిలియన్‌ టన్నులు) మించి ఉత్పత్తి సాధించారు.
  • ఐరన్‌ ఓర్‌ స్లైమ్‌ వినియోగం: ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈ సంస్థ ఐరన్‌ఓర్‌ ఫైన్స్‌కి బదులు ఎన్‌ఎండీసీ వద్ద అందుబాటులో ఉన్న ఐరన్‌ ఓర్‌ స్లైమ్స్‌ని ఉపయోగించుకొనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. 2019-20లో ఈ స్లైమ్స్‌ వినియోగం 9% ఉండగా... 2020-21లో సగటున 25% మేర ఉపయోగించింది. దీన్ని 30%కి పెంచడానికి ప్రణాళికలు రూపొందించింది.
  • నుసి బొగ్గు అధిక వినియోగం: కోకింగ్‌ కోల్‌ ఖర్చును తగ్గించుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుసి బొగ్గు (పల్వరైజ్డ్‌ కోల్‌) వినియోగాన్ని పెంచుకొనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ బొగ్గు వినియోగం 2018-19లో 59.2 కేజీలు( టన్ను హాట్‌మెటల్‌కి) వాడగా... 2020-21నాటికి దాన్ని 97.2 కేజీలకు పెంచారు. 2021-22లో ఈ నుసి బొగ్గు వినియోగాన్ని 117 కేజీలకు తీసుకెళ్లనున్నారు.
  • ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యేక ఉత్పత్తులు: సాధారణ ఉక్కు ఉత్పత్తులతో పాటు ఆదాయం పెంచుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులపై దృష్టి సారించింది. అలాంటి ఉత్పత్తుల విక్రయం 2019-20లో 20% ఉండగా... 2020-21లో అది 25%కి పెరిగింది. ఈ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థ క్రాస్‌ ఫంక్షనల్‌ టీమ్స్‌ని ఏర్పాటు చేసింది. దీని వల్ల అధిక నాణ్యతమైన ఉత్పత్తుల విక్రయాల్లో 2020-21లో 34% వృద్ధి సాధించగలిగింది.
  • టీఎంటీ బార్లపై అధిక దృష్టి: ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ టీఎంటీ బార్ల విక్రయాలపై ప్రధానంగా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాధాన్యమున్న నిర్మాణాలకు సంబంధించిన ఉక్కు అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. టీఎంటీ బార్ల విక్రయం 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో 78% నుంచి 79%కి పెరిగింది. 2018-19లో ఇది 75% మాత్రమే ఉండేది. 2021-22లో దీన్ని 80%కి పెంచుకోవడంపై దృష్టి సారించింది.
  • నేరుగా విక్రయాలు: విక్రయదారులకు ప్లాంటు నుంచే నేరుగా విక్రయాలు జరపడంపై దృష్టి సారించింది. ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత నేరుగా జరిపే విక్రయాలు 7,49,812 టన్నుల నుంచి 2020-21లో 8,43,296 టన్నులకు పెరిగాయి.
  • పెరిగిన ఎగుమతులు: ప్రపంచస్థాయిలో సత్తా చాటుకోవడానికి, ద్రవ్య లభ్యత, లాభదాయకతను పెంచుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఎగుమతులు పెంచింది. ఈ సంస్థ సెంట్రల్‌ డిస్పాచ్‌ యార్డ్‌ నెలకొల్పింది. ఇక్కడి నుంచి ఉత్పత్తులు రైలు, రోడ్డు మార్గం ద్వారా నేరుగా సరఫరా చేయడానికి వీలవుతుంది. దీనివల్ల వాహన, రైలు రేక్‌ల వినియోగ కాలం తగ్గి, సరకు సరఫరా చేయడంలో మెరుగుదల కనిపించింది.

ఇదీ చదవండి

GVMC: జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.