ETV Bharat / city

Money laundering‌: ఖతార్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడిన విశాఖ వాసి ఆస్తులు జప్తు - ఖతార్​లో విశాఖ వాసి మనీలాండరింగ్

మనీలాండరింగ్‌
మనీలాండరింగ్‌
author img

By

Published : Jun 18, 2021, 6:02 PM IST

Updated : Jun 18, 2021, 7:13 PM IST

17:58 June 18

ఖతార్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడిన విశాఖ వాసి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. డోహ్రాలోని అల్​మీరా కన్జ్యూమర్ గూడ్స్ సంస్థలో విశాఖకు చెందిన సుబ్రహ్మణ్య శ్రీనివాస్ పిన్నిటి పనిచేస్తున్నారు. వినియోగదారుల నుంచి లంచం తీసుకున్నట్లు శ్రీనివాస్​పై కేసు నమోదైంది. లంచం సొమ్మును భారత్ బ్యాంకులకు మళ్లించాడని ఖతార్ దర్యాప్తు సంస్థ తేల్చింది. దర్యాప్తునకు, సొమ్ము జప్తునకు సహకరించాలని భారత్​ను కోరింది. 

దీంతో ఇటీవల విశాఖలోని సుబ్రహ్మణ్య శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. విశాఖ, విజయనగరంలో ప్లాట్లు, మ్యూచవల్ ఫండ్స్​లో పెట్టుబడులున్నట్లు ఈడీ గుర్తించింది. ఖతార్ వినతితో ఇప్పటివరకు రూ.88లక్షల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

ఇదీ చదవండి:

Theft: వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు విలువచేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

Last Updated : Jun 18, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.