విశాఖ భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన రెండో సిట్ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 28 తేదీలోగా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను ఆదేశించింది. 2019 అక్టోబరు 17 తేదీన విశాఖ, పరిసర మండలాల్లో భూముల కొనుగోళ్ల వ్యవహారంపై మరో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. విశ్రాంత ఐఎఎస్ అధికారులు విజయ్ కుమార్, వైవీ అనురాధ, విశ్రాంత సెషన్స్ జడ్జి టి. భాస్కర రావులతో సిట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములు, రాజకీయ నాయకులు ఆక్రమించిన భూముల వ్యవహారాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. కొవిడ్ కారణంగా లాక్డౌన్ అమలు చేయటంతో మార్చి నుంచి సిట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిందని.. దీంతో సిట్ తన నివేదికను సమర్పించేందుకు ఫిబ్రవరి 28 తేదీ వరకూ గడువు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ అనంతరం 2020 జూన్ 10 నుంచి సిట్ తన దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.
ఇదీ చదవండి