ETV Bharat / city

విశాఖలో దొంగతనాలకు పాల్పడిన పదిమంది అరెస్టు - విశాఖలో దొంగతనాలు

విశాఖలో దొంగతనాలకు పాల్పడిన పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

దొంగ
దొంగ
author img

By

Published : Oct 28, 2021, 7:02 PM IST

విశాఖ నగరంలో వివిధ దొంగతనాలతో సంబంధమున్న పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు.

నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా సమక్షంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రాగి, యాంప్లిఫైర్లు, ఇతర సామగ్రిని మీడియాకు ప్రదర్శించారు. తగరపువలస వద్ద చోరీకి గురైన లారీని సైతం విజయనగరం జిల్లాలో స్వాధీనం చేసుకుని, ముగ్గరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు నగర పోలీసులు ప్రత్యేక నిఘా బృందాలు, ఆయాస్టేషన్ల పరిధిలో పనిచేశాయని క్రైమ్ ఏసీపీ పెంటారావు వివరించారు.

ఇదీ చదవండి: Murder Attempt on Young Woman: అర్ధరాత్రి ఇంటికొచ్చి డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.