మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించిన తెదేపా నేత గంటా అప్పలకొండను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. తెదేపా రాష్ట్ర కమిటీ, కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
భీమిలి ప్రజల ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారి దేవాలయం నుంచి గంట స్తంభం, మెయిన్ రోడ్డు మీదుగా చిన్న బజార్ వరకు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. చిన్నబజార్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ గంటా అప్పలకొండ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం.. విశాఖ రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే గంటా ఆహ్వానం