ఇసుక కొరత కారణంగా భవన కార్మికుల జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని... తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహించడానికే... ఇసుక కొరత సృష్టించారని తెదేపా ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. జగన్ నిర్ణయం ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసిందన్నారు.
చంద్రబాబు దీక్షతో ఇసుకను అందుబాటులోకి తెస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతి పూర్తయితే చంద్రబాబుకు పేరొస్తుందనే... నిర్మాణం ఆపేశారని ఆరోపించారు.
ఒకరిద్దరు పార్టీ వీడినంత మాత్రాన... తెదేపా కిందపడదని రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పేదల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. లేకుంటే పక్క రాష్ట్రానికి సహాయ మంత్రా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధినేత చంద్రబాబు మార్గనిర్దేశంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.