Tdp leader bandaru on Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో ఏ1 అవినాష్ రెడ్డి అని వివేకా కుమార్తె సునీత స్వయంగా చెప్పారన్నారు. వివేకా హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినా జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీబీఐ విచారణకు అప్పుడు సిద్ధమని.. ఇప్పుడు వెనకడుగు వేశారని విమర్శించారు. సీబీఐ వాగ్మూలంలో వివేకా కుమార్తె ఇచ్చిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
పరిటాల రవి హత్య కుట్రలో జగన్ పాత్ర ఉందని బండారు ఆరోపించారు. కేవలం పదవి కోసం, ఓట్లు కోసం.. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈ సమావేశంలో బండారు సత్యనారాయణతోపాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
వివేక కేసులో సీఎం జగన్ మౌనం వీడాలి: వర్ల రామయ్య
Varla Ramaiah on Jagan over Viveka case: వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ మౌనం వీడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. దోషులను జగన్ ఎందుకు రక్షిస్తున్నారని వర్ల ఆక్షేపించారు. వివేక కేసులో అన్ని వాంగ్మూలాలు జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నా.. జగన్ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. మౌనం నేరాంగీకారమని భావించాలా అని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తు చేస్తే ఇప్పటికే 11 సీబీఐ కేసులు ఉన్నా.. ఇది 12వది అవుతుందని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చట్టాలంటే లెక్కలేనితనమా, పరోక్షంగా వివేకా హత్య కేసులో తన హస్తం ఉందని జగన్ చెప్పకనే చెబుతున్నారా అని ఆరోపించారు. హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ రెడ్డి మాట్లాడటాన్ని బట్టి చూస్తే.. హత్య గురించి జగన్ రెడ్డికి ముందే తెలుసని స్పష్టమవుతోందన్నారు.
ఇదీ చదవండి: