ETV Bharat / city

'సీఎం పర్యటనకు.. పాఠశాలలకు సెలవు ప్రకటించి.. బస్సులు తరలించడమేంటి?' - TDP leader Pattabhi latest news

విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటనపై తెదేపా నేత పట్టాభి మండిపడ్డారు. సీఎం వస్తున్నాడని పాఠశాలలకు సెలవు ప్రకటించి.. బస్సులు తరలించడమేంటని ప్రశ్నించారు. ఏ సందర్భమూ లేకుండా సెలవులు ప్రకటిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు.

తెదేపా నేత పట్టాభి
తెదేపా నేత పట్టాభి
author img

By

Published : Jul 15, 2022, 12:18 PM IST

సీఎం పర్యటనకు.. పాఠశాలలకు సెలవు ప్రకటించి.. బస్సులు తరలించడమేంటి?

పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసం లేకుండా సీఎం అధికార దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. సీఎం విశాఖ పర్యటన కోసం ప్రైవేటు బడులకు సెలవు ప్రకటించి మరీ స్కూలు బస్సులు తరలించడమేంటని ప్రశ్నించారు. 31 స్కూళ్లు, 6 కళాశాలల బస్సులను సీఎం పర్యటనకు వాడతారా అని నిలదీశారు. ఏ సందర్భమూ లేకుండా సెలవులు ప్రకటిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే 8 వేల పాఠశాలలను మూయించి.. విద్యావ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. రేపటి నుంచి సీఎం సభకు కుర్చీలు, బల్లలు అవసరమని అవి కూడా తరలిస్తారేమోనని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: Floods: గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం

ఈ భామకు ఇంత డిమాండా...? యాక్టింగ్‌ తక్కువ... రెమ్యునరేషన్‌ అన్నికోట్లా...?

కోతుల గుంపు మధ్య ఘర్షణ.. కారణం తెలిస్తే షాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.