ETV Bharat / city

Budda Fires On Vijaya Sai: 'ఆయనకు.. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే..' - ఎంపీ విజయసాయిపై బుద్ధా వెంకన్న కామెంట్స్

వైకాపా అధికారంలోకి వచ్చాక ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ ప్రజలను అందినకాడికి దోచుకుంటున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆయన అరాచకాలను బయట పెట్టి.. 'అంకుశం' సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతి పట్టిస్తామని అన్నారు.

విజయసాయికి అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే పట్టిస్తాం

author img

By

Published : Oct 18, 2021, 3:56 PM IST

ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ ప్రజలను బెదిరించి, అందినకాడికి దోచుకుంటున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని.. అప్పడు విజయసాయి బాధితులెవరూ ప్రత్యేకంగా పోలీసు స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదన్నారు.

బాధితుల కోసం విశాఖలో ప్రత్యేకంగా ఒక ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయసాయి కారణంగా భూములు కోల్పోయిన వారికి తిరిగి అప్పగిస్తామన్నారు.

రుషికొండలో పర్యటక శాఖ రిసార్ట్ కూల్చి, ఆయన కూతురికి కట్టబెట్టారని ఆరోపించిన వెంకన్న.. విజయసాయి ప్రజాదర్బార్ ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదని అన్నారు. విజయసాయి రెడ్డి అరాచకాలు బయట పెట్టి.. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతి పట్టిస్తామని అన్నారు.

ఇదీ చదవండి

మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు- రూ.27 కోట్ల అక్రమాస్తుల కేసులో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.