ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (CM Jaganmohan reddy) తెదేపా నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో.. తుగ్లక్ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా విఫలయ్యారని లేఖలో విమర్శలు చేశారు. వ్యవసాయానికి ప్రభుత్వం ఇస్తున్న సాయానికి... చెపుతున్న లెక్కలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. కోస్తా జిల్లాలలో రైతులు క్రాప్ హాలిడే (Crop holiday) ప్రకటించారని తెలిపారు. రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు (Horticultural crops) గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయిందని అయ్యన్న లేఖలో ఆరోపించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల పంట దెబ్బతిందని, చెరకు రైతులకు పేమెంట్లు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ములు ఇవ్వడం లేదన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ఇవన్నీ చాలదన్నట్లు మోటర్లకు మీటర్లు పెడుతున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు ప్రభుత్వమా ? రైతు దగా ప్రభుత్వమా ? అంటూ అయ్యన్నపాత్రుడు లేఖలో గట్టిగా ప్రశ్నించారు.
ఇదీ చదవండి : Causeway: నిండిన రైవాడ జలాశయం.. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన శారదానదిపై కాజ్‌వే