ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి సమావేశమయ్యారు. హరిద్వార్ కుంభమేళాలో పీఠం చేపడుతున్న సేవలను సీఎంకు వివరించారు. చార్ ధామ్ క్షేత్రాల్లో నిత్యం వేద పారాయణ చేపట్టాలని స్వామీజీ సూచించారు. ఉత్తర భారతదేశంలో వేద విద్యభ్యాసానికి ప్రాధాన్యత తక్కువగా ఉందన్నారు.
ఉత్తరాఖండ్‌లో వేద పాఠశాల ఏర్పాటుకు శారదాపీఠం సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డెహ్రాడూన్‌లో స్థలం కేటాయిస్తే సాధువులు, సామాన్యుల కోసం కంటి ఆసుపత్రిని నిర్మిస్తామని స్వామిజీ సీఎంకు తెలిపారు. కంటి వైద్య సేవలు, ఆపరేషన్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఏటా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను ఉత్తరాఖండ్‌లోనే చేపడతారని స్వామిజీ రావత్‌కు వివరించారు.
ఇదీచదవండి: తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు