ETV Bharat / city

Arasavelli Surya Temple: భక్తులకు నిరాశ.. అరసవల్లిలో ఆదిత్యుని తాకని సూర్యకిరణాలు

author img

By

Published : Mar 9, 2022, 10:44 AM IST

Arasavelli Surya Temple: ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయి. ప్రతి ఏడాది మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబర్​ 1, 2 తేదీల్లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. దీనిని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశ చెందారు.

Arasavelli Surya Temple
అరసవల్లిలో ఆదిత్యుని తాకని సూర్యకిరణాలు...

Arasavelli Surya Temple: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి మంచుతో కూడిన మేఘం అడ్డుపడింది. ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ సూర్యనారాయుడ్ని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. కేవలం 3 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు.. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ప్రతి ఏడాది మార్చి నెల 9, 10 తేదీల్లో... అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. ఈ దృశ్యాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈరోజు నిరాశే మిగిలింది. రేపు కూడా పడే అవకాశం ఉందని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.

ఇదీ చదవండి :

Shivaratri in Srikalahasthi: వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని కల్యాణం...కట్నంగా విబూది, బిల్వపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.