అనంతపురం జిల్లాలో..
పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు హిందూపురంలో విద్యార్థులు నివాళులర్పించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో..
పుల్వామా దాడి ఘటనలో అమరులైన వీర జవాన్లకు భారతీయ జనతా యువమోర్చా విశాఖలో నివాళులర్పించింది. యావత్ భారతావని...సైనికులకు అండగా ఉండాలని భారతీయ యువ మోర్చా కోరింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వీర సైనికులను స్మరిస్తూ యువ మోర్చా కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు జిల్లాలో...
పుల్వమా ఘటనలో అమరులైన జవాన్లకు కర్నూలులో విద్యార్థులు నివాళులర్పించారు. జవాన్లకు శ్రద్ధాంజలిగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు.