విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందంటూ.. కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరాం మండిపడ్డారు. స్ట్రేటజిక్ సేల్ చేస్తామని చెప్పడంపై మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో అందరికీ 8 శాతం చొప్పున రుణాలు ఇస్తున్న బ్యాంక్లు.. కర్మాగారం నుంచి 14 శాతం వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఆర్థిక ఏడాదిలో రూ. 1,500 కోట్లు వడ్డీ చెల్లించినట్లు తెలిపారు.
సొంత గనులు ఇచ్చి వుంటే రూ. 3 వేల కోట్లు లాభాలు వచ్చేవని అయోధ్యరాం అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో కేంద్రం రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. రూ. 43 వేల కోట్లు పన్నుల రూపంలో తిరిగి తీసుకుందని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 4న ఆర్కే బీచ్లో వాక్.. 18న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రం దిగి వచ్చి 'స్ట్రేటజిక్ సేల్' నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: