ETV Bharat / city

రక్షణ దళాల సాహసానికి ప్రతీక 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్' - 1971

బంగ్లాదేశ్​ స్వాతంత్య్ర యుద్ధంలో పాకిస్థాన్​ను భారత్​ ఓడించి 2021 డిసెంబర్​ 3కు యాబై ఏళ్లు నిండుతాయి. అందువల్ల ఈ ఏడాదంతా స్వర్ణం విజయ్​ వర్ష్​ ఉత్సవాల్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆనాటి విజయానికి గుర్తుగా ఉన్న స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​ జ్యోతి విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చేరింది.

రక్షణ దళాల సాహసానికి ప్రతీక 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్'

author img

By

Published : Sep 3, 2021, 10:26 PM IST

రక్షణ దళాల సాహసానికి ప్రతీక 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్'

భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​'గా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం డిసెంబరు 16న దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద 'ఎటర్నల్​ ఫ్లేమ్​' నుంచి నాలుగు విజయ జ్యోతులు వెలిగించారు. ఆ జ్యోతులను దేశంలోని నాలుగు దిక్కులకు పంపారు. దక్షిణ భారతదేశం వచ్చిన విజయ జ్యోతి వివిధ ప్రాంతాలు తిరుగుతూ విశాఖ చేరుకుంది.

అండమాన్​ పోర్ట్ బ్లెయిర్​​లోని ఐఎన్​ఎస్​ సుమిత్ర నుంచి విశాఖపట్నం వచ్చిన విజయజ్యోతిని తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎబీ సింగ్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అందుకున్నారు. ఈ సందర్భంగా బీచ్​ రోడ్​లో విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన కార్యక్రమంలో తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్..​ అమర వీరులకు అంజలి ఘటించారు. 1971వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న యుద్ధవీరుల్లో విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 30 మంది ఉన్నారు. యుద్ధ అనుభవాల్ని తెలుసుకోవడానికి వారితో ఉన్నతాధికారులు భేటీ ఏర్పాటుచేశారు.

వీర సైనికులకు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత నివాళులు అర్పించారు. 1971లో పాక్ పైజరిగిన యుద్దంలో పాల్గొన్న విశ్రాంత నౌకాదళ అధికార్లను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమరులైన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనాటి యుద్ద వీరులతో హోంమంత్రి సుచరిత, రాష్ట్ర పర్యాటక మంత్ర ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముచ్చటించి, విశేషాలను తెలుసుకున్నారు.

"దేశాన్ని నాశనం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటి ఆట కట్టించి దేశాన్ని రక్షించేవారు సైనికులు. వారు లేకుంటే మనకు రక్షణ ఉండదు. సైనికుల్ని స్మరించుకోవడం మన కనీస బాధ్యత"

-మేకతోటి సుచరిత, హోం మంత్రి

నగరంలోని వివిధ పాఠశాలలకు కూడా ఈ విజయ జ్యోతి తీసుకు వెళతారు. కిశోర బాల బాలికల్లో ఆనాటి విజయ స్ఫూర్తిని గురించి అవగాహన కల్పిస్తారు. జ్యోతి హైదరాబాద్​కు తీసుకెళ్లేటప్పుడు మార్గంలో స్వర్ణ విజయ వర్ష్ కార్యక్రమాలను రాజమండ్రి, విజయవాడ, నల్గొండలలో నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: భారత నౌకా వాయు విభాగానికి 'ప్రెసిడెంట్ కలర్స్' పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.