Sankranti Special Trains: సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో మరో 10 ప్రత్యేక రైలు ట్రిప్పులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ-విశాఖపట్నం-కాచిగూడ, కాచిగూడ-నర్సాపూర్-కాచిగూడ, కాకినాడటౌన్-లింగంపల్లి-కాకినాడటౌన్ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకండ్ సిట్టింగ్ బోగీలతో పూర్తి రిజర్వేషన్‌తో నడపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
కాచిగూడ-విశాఖపట్నం 7, 14 తేదీల్లో.. విశాఖపట్నం-కాచిగూడ 8, 16 తేదీల్లో.. కాచిగూడ-నర్సాపూర్ 11న, నర్సాపూర్-కాచిగూడ 12న, కాకినాడటౌన్-లింగంపల్లి 19, 21 తేదీల్లో.. లింగంపల్లి-కాకినాడ 20, 22 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ-విశాఖపట్నం రైళ్లు కాజిపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, దువ్వాడ మీదుగా నడుస్తాయి. కాచిగూడ-నర్సాపూర్ బండ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా వెళ్తాయి. కాకినాడ టౌన్-లింగంపల్లి రైళ్లు సామర్లకోట, భీమవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
- 7, 14 తేదీల్లో కాచిగూడ- విశాఖపట్టణం
- 8, 16 తేదీల్లో విశాఖపట్టణం- కాచిగూడ
- 11న కాచిగూడ- నర్సాపూర్
- 12 న నర్సాపూర్- కాచిగూడ
- 19, 21వ తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి
- 20, 22 తేదీల్లో లింగంపల్లి- కాకినాడ టౌన్
ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా సంజీవ్ కిశోర్
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్‌గా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జీఎంగా ఉన్న గజానన్ మల్య శుక్రవారం పదవీ విరమణ పొందారు.
ఇదీ చదవండి:
NTPC Ash Pond Pollution: 'బూడిద ప్రాణాంతకంగా మారింది'.. నిపుణుల కమిటీకి స్థానికుల మొర