BJP President Somu Veerraju: భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం విశాఖలో ఘనంగా జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విశాఖ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి... వ్యవస్థాపక దిన స్ఫూర్తిని శ్రేణులంతా గ్రహించాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలలో అవినీతి తొలగించడానికి భాజపా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. జాతీయ భావాలతో పనిచేస్తామని ప్రజలకు వివరించారు. భాజపా ఈ దేశానికి చారిత్రక అవసరమని... కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన విత్తనాలు వివిధ పేర్లతో ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వీరందరికీ ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం భాజపా మాత్రమేనని చెప్పారు.
BJP President Somu Veerraju: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 20వ తేదీ వరకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని... వాటన్నింటిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు పార్టీ నిర్వహిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర పార్టీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖకు రైల్వేజోన్ వస్తోందని... అందులో సందేహం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ABV Comments: 'తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా'