విశాఖ కలెక్టరేట్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పాము కలకలం రేపింది. సుమారు 5 అడుగులకు పైగా ఉన్న పాము ఏటీఎంలోకి ప్రవేశించింది. దీనిని ఓ వినియోగదారుడు గమనించి భయంతో బయటకి పరుగులు తీశాడు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి స్నేక్ క్యాచర్స్కి సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం అనే నిపుణుడు ఏటీఎంలోకి వెళ్లి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం జనావాసాలకు దూరంగా పామును విడిచిపెట్టారు.
ఇదీ చదవండి :