ETV Bharat / city

ఔరా ! అనేలా 'స్మార్ట్' విశాఖ పనులు..అసలు ఏంటా ప్రత్యేకతలు ? - స్మార్ట్ విశాఖ న్యూస్

ఆకర్షణీయ నగరి విశాఖ.. పర్యాటకంగా ఎంత ప్రసిద్దో.. పారిశ్రామికంగా, చరిత్ర పరంగానూ అంతే ప్రసిద్ది. స్మార్ట్ నగరాల జాబితా లో వినూత్న, వైవిధ్య అంశాలను అమలు చేస్తున్న నగరంగా గుర్తింపు పొందిన అందాల విశాఖ ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. నగర రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు ముందుగా 1600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్‌ సిటీ నమూనా... రానున్న విశాఖ భవిష్యత్త్‌ను కళ్లకు కడుతుండగా.. నగర వాసులు ఔరా అనేలా పనులు సాగుతున్నాయి. అసలు ఏంటా ప్రత్యేకతలు? విశాఖను అంత గొప్పగా ఆవిష్కరించే స్మార్ట్ ప్రణాళికలు ఏమిటి..? వాటి పురోగతి ఏ మేర కనిపిస్తోంది? తదితర అంశాలేంటో చూద్దాం...

'స్మార్ట్' విశాఖ..అసలు ఏంటా ప్రత్యేకతలు ?

author img

By

Published : Jan 8, 2021, 6:22 AM IST

విశాఖ..అభివృద్ధిలో ఈ నగరం స్థానం ఎంతో ప్రత్యేకం. దేశం మొత్తం మీద ఎక్కడ, ఏ అభివృద్ధి నమూనా చూసినా అందులో విశాఖ పేరు కచ్చితంగా కనిపిస్తుంది. పర్యాటకం నుంచి పారిశ్రామిక రంగం వరకు, రక్షణ రంగ స్థావరాల నుంచి బౌద్ధ భిక్షువుల ఆవాసాల వరకు, సాగర తీరం నుంచి మంచు కురిసే మన్యం అందాల వరకు అన్ని రంగాల్లో విశాఖ తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటోంది. అలాంటి నగరం ఇప్పడు.... స్వచ్ఛ నగరం, స్మార్ట్ నగరాల జాబితాలో పోటీ పడుతోంది.

ప్రపంచ నగరిగా మారేందుకు పరుగులు

భౌగోళికంగా సముద్రతీరాన కొలుపుదీరిన విశాఖను.. కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు పెద్ద ప్రమాదాలే పొంచి ఉంటాయి. ఇటీవలి హుద్ హుద్ తుపానే అందుకు ఉదాహరణ కాగా...అది సృష్టించిన విలయాన్ని తట్టుకుని పడి లేచిన కెరటంలా.. ఏడాదిలోనే తన రూపురేఖలు మార్చుకుంది. అదే తీరుగా.. ప్రస్తుతం ఆధునిక హంగులను అద్దుకుంటూ ప్రపంచ నగరిగా మారేందుకు పరుగులు తీస్తోంది. స్మార్ట్‌ నగర అభివృద్ధిలో భాగంగా... 1600 ఎకరాల్లో నమూనా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న అధికారులు, కరోనా విపత్తును ఎదుర్కొంటూ పనులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా.... నిర్ధేశించిన ప్రాంతంలో పూర్తిస్థాయి ఎల్ఈడీ బల్బులను అమర్చారు. విద్యుత్‌ పొదుపులో దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది విశాఖ నగరం.

స్మార్ట్​ నగరిగా మార్చేందుకు 2 రకాల ప్రణాళికలు

విశాఖను స్మార్ట్ నగరిగా తీర్చిదిద్దుకునే క్రమంలో.. 2 రకాల ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మొదటిగా ఎంపిక చేసిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తోన్న... గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్-జీవీఎస్ సీసీఎల్. రెండో వైపు నగర అవసరాలు తీర్చేలా కీలకమైన సదుపాయాలు కల్పిస్తోంది. ఇందుకు గానూ స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా వచ్చే కేంద్ర నిధులు వినియోగిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్న అధికారులు.. అందుకు తగ్గట్టుగానే ప్రయోజనకర ప్రాజెక్టులను మొదట పూర్తి చేస్తున్నారు. అయిదేళ్లలో 30 ప్రాజెక్టులు పూర్తిచేసిన స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

నగర స్వరూపం మార్చే చర్యలు

వెయ్యి కోట్ల నిధులతో 52 ప్రాజెక్టులను చేపట్టగా.. ఇవ్వన్నీ నగర స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయనున్నాయి. ఇందులో కొన్ని పనులు పాలనా సౌలభ్యం, వ్యవస్థలో సమీకృత మార్పుల కోసం చేపట్టారు. సిటీ ఆపరేషన్స్ సెంటర్- సీవోసీ ఏర్పాటూ ఇందులో భాగమే. వినూత్న ఆలోచనగా గుర్తింపు పొందిన స్మార్ట్ పోల్స్ వ్యవస్థనూ నెలకొల్పుతున్నారు. విభిన్న అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించడం, ప్రజలకు అవసరమైన దానిని చేరవేయడం సహా అత్యవసర సమయంలో అప్రమత్తం చేసేందుకు స్మార్ట్‌పోల్స్‌ వ్యవస్థ ఉపయోగించనున్నారు. స్మార్ట్‌పోల్స్‌ నేరుగా సీవోసీ అనుసంధానం చేసి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నిరంతరం నగరాన్ని నిఘా వెయ్యనున్నాయి. సుమారు 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్‌పోల్స్‌ ప్రాజెక్టులోనే ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థనూ ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సుమారు వంద కూడళ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తుండగా... ఇక్కడ అత్యాధునిక ప్రత్యేక కెమెరాలు అమర్చనున్నారు. వీటి ద్వారా వాహనాల రద్దీ అంచనాతో పాటు, రద్దీకి తగ్గట్లు సిగ్నల్స్ సమయాన్ని సర్దుబాటు చేసేలా అధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

సౌర విద్యుత్ వినియోగానికి పెద్దపీట

స్మార్ట్ సిటీ పనుల్లో సౌర విద్యుత్తు వినియోగానికి పెద్ద పీట వేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచి కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ముడసర్లోవ జలాశయంలో నిర్మించిన తేలియాడే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ఆ ఏడాది జనవరిలో జరిగిన ఆకర్షణీయ నగరాల అపెక్స్ సమావేశంలో అందరి దృష్టి ఆకర్షించిన ఈ ప్రాజెక్టు..దేశంలోని వినూత్న ప్రాజెక్టుల్లో మొదటి స్థానంలో నిలిచి, ప్రథమ బహుమతి దక్కించుకుంది. ప్రస్తుతానికి రూఫ్ టాప్ సోలార్‌ ద్వారా 1.6 మెగావాట్లు, ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్టుల ద్వారా 2.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇలాంటి మరిన్ని సోలార్‌ ప్రాజెక్టులు నిర్మించనుండగా, వీటి ద్వారా 7 మెగావాట్ల సౌర విద్యుత్త్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

స్మార్ట్ విద్యాబోధన

విశాఖలో స్మార్ట్ విద్యాబోధన దిశగానూ వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి కొన్ని పాఠశాలలను నమూనా ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. ఎంపిక చేసిన పాఠశాలలో అన్నిరకాల మౌలిక సదుపాయాల కల్పించి..స్మార్ట్ క్యాంపస్‌లుగా మార్చారు. కార్పొరేట్‌ బడులకి దీటుగా వసతులు సమకూర్చడంతో పాటు.. క్రీడా మైదానాలు, ఆట వస్తువులు, సామగ్రిని అందుబాటులోకి తెచ్చారు. తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నగరంలోని 125 జీవీఎంసీ పాఠశాలల్లో ఒక స్మార్ట్ తరగతి కచ్చితంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఆకర్షణీయమైన ఉద్యానవనాలు

నగరంలోని ఉద్యానవనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. బీచ్ రోడ్డులోని ఆల్ ఎబిలిటీస్ పార్క్ అంతర్జాతీయ ఆకర్షణీయ నగరాల సమ్మేళనంలో సత్తా చాటింది. లివింగ్ అండ్ యాక్ససబిల్ లైఫ్ విభాగంలో తుది జాబితాలో చోటుదక్కించుకుంది. 46 దేశాల మధ్య జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో భారత్‌ నుంచి తుదిపోటీలో నిలిచింది ఒక్కవిశాఖయే. ఇదే స్ఫూర్తితో వీఎంఆర్టీఏ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్న ఈ ఉద్యానవనం.... విశాఖ సిగలో మరో మణిహారంగా నిలిచిపోనుంది. స్మార్ట్ సిటీ ప్రణాళికలో నమూనాగా నిలవనున్న ప్రాంతంలో...ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అన్ని వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాంతంలో 24 గంటల మంచినీటి సరఫరా కోసం 86 కోట్లు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, వరద నీటి పారుదల కాలువల కోసం 75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 20 కిలోమీటర్ల పరిధిలో స్మార్ట్ వీధులు తీర్చిదిద్దుతుండగా..ఇందుకు 55 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక నడకదారిని నిర్మిస్తున్నారు. పార్కింగ్ సమస్యకు పరిష్కారం దిశగా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వ్యవస్థను జగదాంబ కూడలి వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

చారిత్రక అంశాలకు ప్రాధాన్యం

స్మార్ట్ సిటీ పనుల్లో చారిత్రక అంశాలకు సైతం ప్రాధాన్యతనిస్తున్నారు. విశాఖ చరిత్రలో కీలకమైన టౌన్ హాల్‌, పాత మున్సిపల్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకోగా...త్వరలోనే ఆకర్షణీయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఎంవీసీ కాలనీలో ఏర్పాటు చేయనున్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఓ కలికితురాయిగా మారనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బాస్కెట్ బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. వీక్షకులకు, క్రీడాకారులకు అన్ని రకాల వసతులను సమకూర్చుతున్నారు.

వైవిధ్య ప్రాజెక్టులో విశాఖ నగరం స్మార్ట్‌గా దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతోంది. కొవిడ్ లాక్‌డౌన్ ప్రభావంతో కొన్ని ప్రాజెక్టుల పనులు నిలిచిపోగా.. నిర్దేశించుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే..ప్రస్తుత విశాఖ మరింత ఆకర్షణీయ నగరిగాను స్వాగతం పలుకుతుందనంటున్నారు విశాఖవాసులు.

'స్మార్ట్' విశాఖ..అసలు ఏంటా ప్రత్యేకతలు ?

ఇదీచదవండి

ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటున్న చిట్వేల్- రాపూరు రోడ్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.