ETV Bharat / city

ఎన్నో మార్పులతో.. నూతన ఉత్తేజంతో... పునఃప్రారంభం

సుదీర్ఘ విరామం అనంతరం విశాఖ విమానాశ్రయంలో కాసేపట్లో విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. లాక్ డౌన్ విధింపుతో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నివారణ దిశగా అత్యంత పటిష్టమైన ఏర్పాట్లను విమానాశ్రయ పరిధిలో అమలు చేస్తున్నారు. సాంకేతికతను సైతం విస్తృతంగా వినియోగించనున్నారు. తొలిసారిగా విమానాశ్రయంలో అడుగుపెట్టిన తరువాత ఏ విధమైన నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ వ్యవస్థ వినియోగిస్తున్నారు. ఇవాళ మొత్తం నాలుగు విమానాలు విశాఖకు చేరుకోనున్నాయి.

author img

By

Published : May 26, 2020, 7:45 AM IST

services started from vishakapatnam airport
విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన సేవలు

విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ నుంచి నాలుగు విమానాలు విశాఖకు వస్తాయి. దిల్లీ నుంచి వచ్చే ప్రయాణీకులు 7 రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఆ తరువాత మరో 7 రోజులు హోం క్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి ప్రయాణీకులకు స్వాప్ టెస్టులు తీసుకున్న అనంతరం 7 రోజులు హోం క్వారంటైన్​కు పంపించనున్నారు. చెన్నై, విశాఖ మధ్య విమాన సర్వీసు రద్దు అయినట్లు విమానాశ్రయ డైరెక్టర్ రాజా కిషోర్ తెలిపారు.

కోవిడ్ అనంతర మారిన పరిస్థితులకు అనుగుణంగా విమానాశ్రయంలో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా భౌతిక దూరం, టచ్ పాయింట్స్ ను నివారించండంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కచ్చితంగా మనిషికీ, మనిషికీ మధ్య నిర్ధిష్ట దూరం ఉండేలా మార్కింగ్స్ ఇప్పుడు విమానాశ్రయం అంతటా కనిపిస్తాయి. ఎరైవల్ గేట్ లోకి ప్రవేశించడం మొదలు ప్రయాణికుడికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు, లేదా టికెట్ వంటి వాటిని సిబ్బంది పట్టుకునే అవకాశం ఉండదు. పూర్తిగా కంప్యూటరైజ్ చేసిన వ్యవస్థ ద్వారా బోర్డింగ్ పాస్ లు జారీ చేయడం, లగేజ్ కోసం అవసరమైన స్టిక్కర్లు రావడం వంటి అనేక పనులు జరిగిపోతాయి.

ఇదీ చదవండి: తొలిరోజు నడిచిన దేశీయ విమానాలెన్నో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.