విశాఖ జిల్లాలో శిరోముండనం కేసుకు సంబంధించి.. సినీ నటుడు, నిర్మాత నూతన్‌నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇంట్లో ఐఫోన్ పోయిందన్న కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిచి నూతన్ నాయుడు కుటుంబీకులు శిరోముండనం చేయించారు. ఈ దాడి వెనక నూతన్‌నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నామని సీపీ తెలిపారు. అతడిని కర్నాటకలోని ఉడిపిలో అరెస్ట్ చేశామని… ఆయన దగ్గర మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
కర్ణాటక పోలీసులు అతడిని ఓ కోర్టులో హాజరుపరిచారని.. అక్కడి నుంచి తమ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి కోరుతున్నామని వివరించారు. అలాగే... రిటైర్డ్ ఐఏఎస్ పీవి.రమేష్ పేరిట కొంతమందికి కాల్ చేసి… తన సొంత పనులు చేసుకోవాలని నూతన్‌నాయుడు ప్రయత్నించాడని సీపీ తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌తో పాటు మరో ముగ్గురు వైద్యులకు కాల్ చేసి శిరోముండనం కేసులో అరెస్టు అయిన వారిలో మధుప్రియ అనే మహిళకు ఆరోగ్యం బాలేదని ధ్రువీకరించాలని సూచించారని చెప్పారు. నూతన్‌నాయుడు ప్రస్తుతం కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడని.. త్వరలోనే విశాఖపట్నం తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: