ప్రతి రోజు పండగే చిత్రబృందం విశాఖలో సందడి చేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బంధుత్వాల విలువలు తెలియజేసే కథాంశంతో నిర్మించామని చిత్ర బృందం తెలిపింది.
దిశా ఘటన నేపథ్యంలో మహిళలకు ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలిసుండాలని సాయి ధరమ్ తేజ్ అభిప్రాయపడ్డారు. వీటిపై తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించాలని సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు యాప్స్ వినియోగించాలన్నారు.