సాహసోపేత నిర్ణయాలను తీసుకోవటంలో సీఎం జగన్కు సాటి మరొకరు లేరని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు విశాఖలో అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంస్థ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వాల్తేర్ డిపోలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కృష్ణబాబు ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదాల బారిన పడిన వ్యక్తులను పరోక్షంగా కాపాడగలుగుతామని అన్నారు. ప్రమాదాలను నివారించే విధంగా ప్రతీ ఒక్కరూ వాహనాలు నడపాలని సూచించారు.
ఇదీ చదవండి