Revenue Employees Protest : విశాఖ జిల్లా పెందుర్తి ఆర్‌ఐపై వైకాపా నాయకుల దాడిని ఖండించారు రెవెన్యూ ఉద్యోగులు. దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. ఆర్ఐపై దాడి చేసిన స్థానిక వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్ సహా మిగిలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల స్వాధీనానికి వెళ్లిన ఆర్ఐ శివతో పాటు, వీఆర్వో శంకర్‌ను తీవ్రంగా కొట్టడం దారుణమని మండిపడ్డారు. అంతు చూస్తామంటూ అధికారులను బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే పరిస్థితి ఉండదని వాపోయారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వ భూములను కాపాడటం అసాధ్యమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఎస్‌ఆర్‌లు పరిశీలించాకే బిల్లులు ప్రాసెస్ చేయగలం - ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!