ETV Bharat / city

AP GENCO : జెన్‌కో యూనిట్లను బలపరచండి: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ

author img

By

Published : Oct 27, 2021, 2:06 PM IST

Updated : Oct 27, 2021, 2:48 PM IST

విద్యుత్ అవసరాలకు సోలారు విద్యుత్తునే కొనుగోలు చేయాలనే కేంద్రం సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు (strengthening ap genco power generation units) విశాఖకు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌కు ఆయన మెయిల్‌ ద్వారా లేఖ రాశారు.

AP GENCO
AP GENCO

విద్యుత్ అవసరాలకు సోలారు విద్యుత్తునే కొనుగోలు చేయాలనే కేంద్రం సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు విశాఖకు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌కు ఆయన మెయిల్‌ ద్వారా లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ కార్పొరేట్‌ కంపెనీల వైపు మొగ్గుచూపకుండా, రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్తు తయారీ యూనిట్లను బలపరచుకోవాలని (strengthening ap genco power generation units) సూచించారు. ఇప్పటికే ఈ యూనిట్లకు నిధులు కేటాయించకుండా, విద్యుత్తు తయారీ కోసం బొగ్గును ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని శర్మ ఆరోపించారు. ముందు వీటి పై దృష్టి సారిస్తే తక్కువ ధరకే విద్యుత్తు అందుబాటులో ఉంటుందని సూచించారు. అలా కాదని సోలార్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తే, కొనుగోలు చేసే అధిక ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం వేసినవారవుతారని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: LHB COACHES: ఆ ఐదు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు

Last Updated : Oct 27, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.