ETV Bharat / city

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని.. కంపెనీ వద్ద ఆర్​ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తెలిపారు.

author img

By

Published : May 9, 2020, 10:08 AM IST

Updated : May 9, 2020, 12:00 PM IST

residents-of-venkatapuram-worry-at-vishakha-lg-company
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆర్​ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని స్థానికులు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరిని అరెస్టు చేశాక.. మరికొందరు గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ వద్దకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకుని..ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం: స్థానికులు

పరిశ్రమ చుట్టు పక్కల తాగునీరు కలుషితమైందని...ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడంలేదన్నారు. ఎవరు గట్టిగా మట్లాడినా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్రమాద ఘటన పై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాధితుల చికిత్సకు డబ్బు చెల్లించాలని కొన్ని ఆస్పత్రులు అడుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ...బాధిత 5 గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడాలని వారు కోరారు. బాధిత 5 గ్రామాల్ల ఆక్సిజన్ స్థాయి పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం సహాయచర్యలు చేపట్టకుంటే ఇక్కడకు ఎవరూ రారన్నారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ కూడా మోగలేదని స్థానికులు తెలిపారు. కంపెనీలో ఉపాధి పొందుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారన్నారు.

ఇవీ చదవండి...విషవాయువు ధాటికి ఊరు దాటిన 7 లక్షల మంది !

Last Updated : May 9, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.