కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారిగా సర్జరీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ పి. మైథిలి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగిన ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి. సుధాకర్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి ఉప పర్యవేక్షక వైద్యాధికారి. ప్రొఫెసరుగా సుదీర్ఘకాలం సేవలందించిన ఈమె రాష్ట్ర విభజన తర్వాత కేజీహెచ్ సర్జరీ విభాగ ప్రొఫెసరుగా 2014లో బాధ్యతలు చేపట్టారు.
కేజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించి జూలై 31న డాక్టర్ జి. అర్జున ఉద్యోగ విరమణ చేశారు. అప్పటినుంచి డాక్టర్ సుధాకర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థానంలో ఈమెను నియమిస్తూ గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు బాధ్యతలు చేపట్టారు.
ఆసుపత్రిలో వివిధ అంశాలపై అవగాహన ఏర్పరచుకొని రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని డాక్టర్ మైథిలి తెలిపారు. ఈమె ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు చెల్లెలు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేజీహెచ్ పరిపాలన విభాగ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు, పరిపాలనాధికారి జోగిరాజు, మేనేజరు టీ. శేషేంద్రశర్మ తదితరులు పాల్గొని కొత్త సూపరింటెండెంట్‌ను అభినందించారు.
ఇదీ చదవండి :