ETV Bharat / city

అత్యాధునిక గస్తీ సంపత్తి సిద్ధమవుతోంది: అతుల్​కుమార్​జైన్

author img

By

Published : Dec 4, 2020, 4:01 PM IST

ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకునేందుకు వీలుగా నౌకా వాణిజ్యానికి పూర్తి భద్రత కల్పించేందుకు... అత్యాధునిక గస్తీ సంపత్తి సిద్ధమవుతోందని తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్​కుమార్​జైన్ వెల్లడించారు. రక్షణ పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా... విమానాలను మోసుకుపోగల యుద్ధ నౌకలు, సుదూర ప్రయాణం చేయగల నౌకలు, అణు జలాంతర్గాములను సమకూర్చుకోవాలని ఆయన వివరించారు. 2022 నాటికల్ల ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళానికి చేరుతుందని, ఇదే సమయంలో అత్యాధునిక విమానాలు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Preparing state-of-the-art patrol property: Atul Kumar Jain
అతుల్​కుమార్​జైన్
అతుల్​కుమార్​జైన్

ప్రతిఏటా డిసెంబర్ నాలుగున జరిగే నౌకాదళ దినోత్సవం సందర్భంగా... తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్​కుమార్​జైన్ మీడియా సమావేశం నిర్వహించారు. తూర్పునౌకాదళ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో కొవిడ్​లో నౌకాదళం నిర్వహించిన పాత్ర, విదేశాల నుంచి భారతీయులను తీసుకువచ్చిన ఆపరేషన్ల తీరును వివరించారు. పాక్, చైనాలు దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ... అస్థిర పరిస్ధితులను కల్పిస్తున్నాయని, దీనిని ఎదుర్కోవడానికి జలమార్గంలో భారత నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు.

హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగానూ అత్యంత కీలకమైన ప్రాంతమని ఇక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని నౌకాదళం క్షిపణి ప్రయోగాల్ని సమర్థంగా నిర్వహిస్తున్నామని జైన్ వివరించారు. బంగాళాఖాతంలో ప్రతిరోజూ దీపావళి మాదిరిగానే ఉందని పేర్కొన్నారు. రానున్న మూడునాలుగేళ్లలో సముద్రజలాల్లో రక్షణ కోసం కొత్తగా ఎయిర్​క్రాఫ్ట్స్, సబ్​మెరైన్లు, గస్తీ కోసం సమకూర్చుకుంటామని అతుల్​కుమార్​జైన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎలాంటి సమయంలోనైనా వీటిని మోహరించడానికి, ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పారు.

అత్యాధునిక గస్తీ సంపత్తి సిద్ధమవుతోంది...

మహిళా నావికులతో మరో సాహస యాత్ర త్వరలో ప్రారంభిస్తామని జైన్ చెప్పారు. కవరత్తి క్లాస్ యాంటీ సబ్​మెరైన్ నౌకలు రెండు సిద్ధమవుతున్నాయని, ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ 2022 నాటికి కమిషన్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. మిలన్ మినీ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ 2022 మార్చిలో నిర్వహించ తలపెట్టినట్టు వెల్లడించారు. 40కి పైగా స్నేహపూర్వక దేశాల నౌకాదళాలకు ఆహ్వానం పంపుతున్నట్టు వివరించారు.

ఇదీ చదవండీ... నౌకాదళ దినోత్సవానికి సిద్ధమౌతున్న సాగరతీరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.