విశాఖ జిల్లా గిరిపుత్రుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏ చిన్న రోగం వచ్చినా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే వారు పడే బాధలు వర్ణనాతీతం. తాజాగా వడ్డాది మాడుగుల మండలం కొత్త వలస గ్రామానికి చెందిన నిండుగర్భిణిని డోలీ కట్టి ఆసుపత్రికి తరలించారు. సమారు 15 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలించేందుకు... రాళ్లు రప్పలు, కొండ కోనలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల వరకు డోలీలోనే తీసుకువెళ్లారు. అనంతరం తాటిపర్తి సెంటర్ నుంచి ఆటో ద్వారా కేజేపురం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి..