ETV Bharat / city

ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేశాం: బొత్స - AP Latest News

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో నూతన ఆస్తి పన్ను విధానంలో మొత్తం అంతా కలిపి 15 శాతం లోపే ఉంటుందని... మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేసినట్టు గుర్తుచేశారు. దీనిపై అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jun 10, 2021, 7:25 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

మున్సిపాలిటీల్లో నూతన ఆస్తి పన్ను విధానంలో మొత్తం అంతా కలిపి 15 శాతం లోపే ఉంటుందని... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇంటి పన్నులు పెంపుపై ప్రతి పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేసినట్టు చెప్పారు. శాసనసభలో ఈ అంశాన్ని వెల్లడించనట్టు గుర్తుచేశారు. నివాస భవనాలకు 0.10 నుంచి 0.50 శాతం వరకు, నివాసేతర భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను వేసినట్టు స్పష్టం చేశారు.

ఇంటి పన్ను విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని... మంత్రి బొత్స వివరించారు. అన్ని రాష్ట్రాల్లో పన్ను విధానం పరిశీలించే... మన రాష్ట్ర పన్ను విధానం తయారు చేసినట్టు చెప్పారు. మొత్తం అంతా కలిపి ఇప్పుడు చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు 15 శాతం మించి ఉండదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలు యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని చెప్పారు. చిన్న ప్రాంతాల్లో నెలకు 30 రూపాయలకు మించి యూజర్ ఛార్జ్ వేయవద్దని చెప్పినట్టు వెల్లడించారు.

ఇదీ చదవండీ... అసంఖ్యాక అభిమానులను పొందిన బాలకృష్ణ నూరేళ్లూ జీవించాలి..: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.