తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు మోహరించారు. 'పోలవరం పరిరక్షణ యాత్ర' పేరిట ఆదివారం సీపీఐ నాయకులు ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల సీపీఐ నాయకులు యాత్రకు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు రామకృష్ణ శనివారం రాత్రి రాజమహేంద్రవరం రాగా పోలీసులు మోహరించారు.
పోలవరం యాత్రకు వెళ్లకుండా తమను నిర్బంధిచడం దారుణమని రామకృష్ణ అన్నారు. జిల్లాల్లోనూ సీపీఐ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా?... పోలీస్ రాజ్యమా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇదీ చదవండి