విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.60 లక్షలు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ధారకొండ నుంచి వస్తున్న రెండు కార్లును పోలీసులు అనుమానం వచ్చి నిలిపారు. కార్లను తనిఖీచేయగా ప్యాకింగ్ చేసిన గంజాయి లభించింది. ధారకొండలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకెళుతున్నట్లు నిందితులు వెల్లడించారు.
రెండు కార్లలో ఉన్న మహ్మద్ అశ్చక్, శైక్ అజ్మత్, మహ్మద్ అరీఫ్ కైరేసీ, మీర్జా శప్తన్ భైగ్, రిజ్వంఖాన్, శైక్ అల్యజ్, శైక్ యోనుస్ అనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.93 వేలు నగదు, రెండు చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి ఎఎస్పీ విద్యాసాగరనాయుడు తెలిపారు. నిందితులు మహారాష్ట్ర, తెలంగాణాకు చెందినవారన్నారు.
ఈ దందాకు సంబంధించి... వీరి వద్ద నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయి 330కిలోలు ఉండగా.. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 60 నుంచి రూ. 70 లక్షలు ఉండవచ్చునని అంచనా వేశారు. గూడెం కొత్తవీధి సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ ఐ అనీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌పీ తెలిపారు.
ఇదీ చదవండి: