ETV Bharat / city

'రాష్ట్రంలోని ఐఏఎస్​, ఐపీఎస్​లు సమావేశం అవ్వండి'

author img

By

Published : Feb 3, 2021, 2:18 PM IST

రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ఐఏఎస్​, ఐపీఎస్​లు సమావేశం కావాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సూచించారు. ఓటర్లను భయపెట్టి ఎన్నికలు ఏకగ్రీమయ్యేలా అధికార పార్టీ చూస్తోందని మండిపడ్డారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బడ్జెట్ ప్రతులను కాంగ్రెస్ నేతలు తగులబెట్టారు.

pcc president meet at narsipatnam
నర్సీపట్నంలో పీసీసీ అధ్యక్షుడి సమావేశం
నర్సీపట్నంలో పీసీసీ అధ్యక్షుడి సమావేశం

రాష్ట్రంలో పరిపాలన విధానాలపై ఎలక్షన్ కమిషన్​కు ఐఏఎస్, ఐపీఎస్​లు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితులు ఎదురయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను కాంగ్రెస్ నేతలు తగులబెట్టారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని శైలజనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిపాలన స్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఇందుకు తగ్గట్టుగా నాయకత్వ లోపం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఓటర్లను భయపెట్టి ఎన్నికలు ఏకగ్రీమయ్యేలా అధికార పార్టీ చూస్తోందని మండిపడ్డారు.

ఏ చిన్న కార్యక్రమానికి కూడా ప్రభుత్వం అనుమతివ్వట్లేదని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అనుమతులివ్వకపోతే.... పాదయాత్రలు చేసేవాళ్లా అని నిలదీశారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్‌ అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి.

పట్టాభిపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.