జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ జనాల్లోకి వెళ్తున్నారు. విశాఖలో నవంబర్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి తరఫున పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే దిశగానే ర్యాలీ నిర్ణయమని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి