స్వర్ణిం విజయ్ వర్ష్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. తూర్పునౌకాదళం పరేడ్ ఆఫ్ సెయిల్స్లను నిర్వహించింది. విశాఖ హార్బర్లో ఏర్పాటు చేసిన ఈ పరేడ్‌లో 45 బోట్లు పాల్గొన్నాయి. దాదాపు 75 మంది ఔత్సాహికులు ఈ పోటీలకు హాజరయ్యారు. దిల్లీకి చెందిన ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీఫ్ స్టాఫ్ ఆఫీసర్, రియర్ అడ్మిరల్ జ్యోతిన్ రైనా ఈ పోటీలను ప్రారంభించారు. అసమాన ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. హబ్బీ కాట్, లేసర్ బహియా, లేసర్ స్టాండర్డ్, లేసర్ రేడియల్, ఎంటర్ప్రైస్, 29 ఇఆర్, బిక్ నోవా విండ్ సర్ఫర్లు, ఆప్టిమిస్ట్, సీ కాయక్స్ వంటి పడవలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.
ఇదీచదవండి.