విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పోలీసులు తన దీక్షను భగ్నం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని విమర్శించారు. కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరగాలని కోరారు.
ఇదీ చదవండి