విశాఖ ప్రజలు స్థానికేతరులను చేరదీస్తారని... వారి స్వభావం, నడవడికను బట్టి ఆదరిస్తారని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లను ఆదరించరని అన్నారు. కనీసం ఒక్క రైతు అయినా అశోక్‌గజపతిరాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. విశాఖలో భూములు కోసం తప్ప మరో అంశం కోసం వైకాపా నేతలు ఆలోచన చేయడం లేదని ఆరోపించారు. వైకాపా నేతలు అశోక్ గజపతిరాజును విమర్శించడం తగదని హితవు పలికారు.
ప్రగతి భారతి ట్రస్టు ద్వారా విజయసాయి రెడ్డి జేబులో డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అని పల్లా ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు వారి సొంత ఆస్తులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రమాణం చేస్తారని, సొంత డబ్బులతోనే ప్రగతి భారతి ట్రస్టు నిర్వహిస్తున్నట్టు విజయసాయి... ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.
ఇదీ చదవండీ... ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'