రాష్ట్ర అధికార భాషా సంఘం కార్యాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నం తరలిస్తున్న ఘనత సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు దక్కుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్ర వర్సిటీలో ఏపీ అధికార భాషా సంఘం రూపొందించిన ‘పదకోశం - మీకోసం’ పుస్తకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'పదదకోశాన్ని రూపకల్పన చేసిన అధికార భాషా సంఘాన్ని విజయసాయిరెడ్డి అభినందించారు. ‘పదకోశం-మీకోసం’ పుస్తకం ఉపయుక్తంగా ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
తెలుగును పాలన భాషగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార భాషా సంఘం చేస్తున్న కృషిని ఆ సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వివరించారు. పదో తరగతి వరకు తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య షేక్ మస్తాన్, ఆంధ్ర వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: