ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని సూచించింది.
ఇదీ చదవండి