విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెంచుతూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీఎంఆర్డీఏ పరిధిలోకి మరో 13 మండలాలు తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 13 మండలాల్లోని 431 గ్రామాలు వీఎంఆర్డీఏలో విలీనం కానున్నాయి. నర్సీపట్నం, నాతవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, రోలుగుంట, గొలుగొండ, కోటవురట్ల, మాకవరపాలెం, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతం, మాడుగుల, చోడవరం వీఎంఆర్డీఏ పరిధిలోకి వెళ్లనున్నాయి. వీఎంఆర్డీఏ పరిధి 7,328 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఇదీ చదవండీ... బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ