లాక్ డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్య విపత్కర సమయాల్లో అందుబాటులో ఉన్న రక్త నిల్వలు వినియోగించారు. ఈ పరిణామంతో గర్భిణులు, లుకేమియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు.. అవసరమైన వేళలో రక్తం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు విశాఖలోని ప్రగతి భారతి ఫౌండేషన్, రెడ్ క్రాస్ సంస్థలు సంయుక్తంగా రక్త దాతలను ఆహ్వానించి రక్త నిల్వలను పెంచుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ముందుకు వచ్చి అందుబాటులో ఉన్నవారు రక్తదానం చేయాలని కోరుతున్నారు.
రక్త దానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి - ap lockdown
లాక్ డౌన్ వేళ దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని స్వచ్చంధ సంస్థలు పిలుపునిస్తున్నాయి. రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నాయి.